- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
CM కేసీఆర్‌కి T- బీజేపీ చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ..

దిశ, కరీంనగర్ బ్యూరో: ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కోసం నిర్వహిస్తున్న దేహదారుడ్య పరీక్షల్లో ఎదురైన లోపాలను, నెలకొన్న అవకతవకలను వెంటనే సవరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్‌కు భిన్నంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నందున.. ఈ విషయంపై వెంటనే సమీక్షించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాసిన బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు.
లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో నోటిఫికేషన్‌లో పేర్నొన్న నిబంధనలు కాకుండా కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చారని.. దీనివల్ల రాష్ట్రంలోని దాదాపు 2 లక్షల మంది పురుష, మహిళా అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయని.. వీటన్నింటిని సవరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవల్సి ఉందని ఆయన సీఎంకు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీసు ఉద్యోగాల నియమాక ప్రక్రియ మొదటి నుండి వివాదాలకు తావిచ్చేలా తయారు కావడం దురదృష్టకరమని, ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల విషయంలోనూ అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించకోకపోవడం బాధాకరమని సంజయ్ అన్నారు. దేహదారుఢ్య పరీక్షల్లోనూ నోటిఫికేషన్‌కు భిన్నంగా కొత్త నిబంధనలు పెట్టి అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయడం అన్యాయమన్నారు.
దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ లాంగ్ జంప్ 3.8 మీటర్లుగా ఉన్నప్పటికీ.. మన రాష్ట్రంలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. లాంగ్ జంప్‌తో పాటు షాట్ పుట్ విషయంలోనూ పాత విధానాన్నే అమలు చేయాలని, లాంగ్ జంప్ విషయంలో ఆన్ ది లైన్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు సంబంధించిన మార్కులు అభ్యర్థులందరికీ కలపాలని కోరారు. ఈ తప్పిదాలను సరిదిద్ది లక్షలాది మంది అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని కోరారు.