సిరిసిల్ల 17వ బెటాలియన్ లో వస్తువుల వేలం : బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రమణ్యం

by Disha Web Desk 1 |
సిరిసిల్ల 17వ బెటాలియన్ లో వస్తువుల వేలం : బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రమణ్యం
X

దిశ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ లోని పాత కంప్యూటర్లు, యూనిఫాం క్లాత్స్, పాత టెంట్లు, ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ సామానులను వచ్చే నెల 3న బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లో వేలం వేయనున్నట్లు బెటాలియన్ కమాండెంట్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిని వారు ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో హాజరు కావాలని తెలిపారు. వేలంలో పాల్గొంటే వారు ముందస్తుగా రూ.వేయి డిపాజిట్ చేయవలసి ఉంటుందన్నారు. వేలం పాటలో పాల్గొనే వారు 8712657570, 8712597285 ఫోన్ నంబర్లను సంప్రదిస్తే పూర్తి వివరాల కోసం బెటాలియన్ సిబ్బంది తెలుజేస్తారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed