సింగరేణి నర్సరీని సందర్శించిన అదనపు కలెక్టర్..

by Sumithra |
సింగరేణి నర్సరీని సందర్శించిన అదనపు కలెక్టర్..
X

దిశ, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రం సెంటినరీ కాలనీలోని సింగరేణి నర్సరీని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ బుధవారం సందర్శించారు. నర్సరీకి వచ్చిన అదనపు కలెక్టర్ ను రామగుండం 3 ఏరియా జీఎం ఎన్.సుధాకర రావు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నర్సరీలో ఉన్న వివిధ జాతుల మొక్కలు, ఏరియాలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా నాటిన మొక్కల గురించి జీఎం తెలియజేశారు.

ఈ సంవత్సరంలో సుమారుగా 1,75,000 మొక్కలను నాటనున్నామని పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ నర్సరీ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి సంస్థ చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా ఉందని, ఇదే ఒరవడిని కొనసాగించి జిల్లాకు కేటాయించిన లక్ష్యంతో పాటు సింగరేణి లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్రీ డీజీఎం బానోత్ కర్ణతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story