ఎడారి దేశంలో ఆగిన వలస జీవి గుండె..

by Sumithra |
ఎడారి దేశంలో ఆగిన వలస జీవి గుండె..
X

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా ఉపాధి కోసం ఉన్న ఊరును విడిచి ఎడారి బాట పట్టిన మరో వలస జీవి గుండె ఆగిపోయింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తాండ్రియాల గ్రామానికి చెందిన కోమిరెల్లి గంగారెడ్డి (50) సౌదీలో అనారోగ్యంతో మృతి చెందాడు. వలస జీవి అయిన గంగారెడ్డి సౌదీలో అనారోగ్యానికి గురి కాగా ఆస్పత్రిలో చేర్పించారు.

పరీక్షలు చేసిన వైద్యులు మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు నిర్ధారించి విడతల వారీగా రెండు సార్లు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం కోలుకోక పోగా నాలుగు నెలల నుంచి కోమాలో ఉన్న గంగారెడ్డి జూలై 7వ తేదీన మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కడసారి చూపుకైనా మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాలని కోరుతున్నారు.

Next Story