బీసీ రిజర్వేషన్లు పెంచాలి.. జాతీయ బీసీ కమిషన్​ చైర్మన్​కు జాజుల వినతి

by Dishafeatures2 |
బీసీ రిజర్వేషన్లు పెంచాలి.. జాతీయ బీసీ కమిషన్​ చైర్మన్​కు జాజుల వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని జాజుల శ్రీనివాస్​గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం జాతీయ బీసీ కమిషన్ ​చైర్మన్​ హన్సరాజ్​ గంగారం హయిర్​ను హైదరాబాద్లో ప్రత్యేకంగా కలసి వినతి పత్రాన్ని ఇచ్చారు.దేశంలో జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 27% నుండి 50% కు పెంచాలన్నారు.దేశంలోని అన్ని వర్గాలకు ఎస్సీ ,ఎస్టీ , అగ్రకులాలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించి బీసీలకు మాత్రం వివక్ష చూపడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా బీసీలు ఉంటే కేవలం 27 శాతమే రిజర్వేషన్లు కల్పించారని జాజుల గుర్తు చేశారు. దీంతో పాటు ప్రస్తుతం రిజర్వేషన్లు అమలవుతున్న ఏ సామాజిక వర్గానికి లేని క్రిమిలేయను బీసీలపై బలవంతంగా రుద్దారని జాజుల పేర్కొన్నారు. దీని వలన ఎంతో మంది బీసీలు ఇబ్బందులు పడుతున్నట్లు స్పష్టం చేశారు.

బీసీ క్రిమిలేయర్ ను తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జాతి జనగణలో బీసీ కులగణన, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ఉన్నత న్యాయస్థానాల్లో, న్యాయమూర్తుల నియమకాలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ తాటిపల్లి పాండు, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వరికుప్పల మధు, బండి గారి రాజు, అశోక్, శివ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed