అది అవ్వదమ్మా! క్యూ లైన్‌లో హైదరాబాద్ మెట్రో ఎక్కడం సాధ్యమేనా?

by Disha Web Desk 14 |
అది అవ్వదమ్మా! క్యూ లైన్‌లో హైదరాబాద్ మెట్రో ఎక్కడం సాధ్యమేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశాల్లో రోడ్డుపై ఒకే లైన్‌లో వహనాలు పోవడం, బస్సులు, మెట్రోలు ఎక్కేటప్పుడు ప్రయాణికులు క్యూ లైన్‌ పాటించే పద్దతులు మనం సోషల్ మీడియాలో తరుచూ చూస్తూనే ఉంటాము. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన చైనా.. రాజధాని నగరం బీజింగ్‌ లోని ఓ మెట్రో స్టేషన్‌లో అక్కడి ప్రయాణికులు ఎలాంటి హడావుడీ లేకుండా క్యూలైన్ పాటిస్తూ మెట్రో‌లోకి ఎక్కుతున్నారు. అయితే మెట్రోలో వచ్చిన వారు కిందికిదిగే వరకు ఎక్కాల్సిన ప్రయాణికులు క్యూ పాటిస్తూ.. తర్వాత క్యూలో మెట్రో రైలు ఎక్కుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ‘హయ్ హైదరాబాద్’ అనే ఓ నెటిజన్ హైదరాబాద్ మెట్రో‌ ట్రైన్ అధికారులకు ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేశారు.

మన నగర వాసులు ఇలా క్యూ పద్దతి పాటించాలని నెటిజన్ పేర్కొన్నాడు. అయితే వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో అది అవ్వదమ్మా అంటూ ఓ నెటిజన్ ఫన్నీగా స్పందించాడు. హైదరాబాద్ మెట్రో ట్రైన్‌కు కేవలం మూడు కోచ్‌లు ఉండటం.. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు హడావుడితో మెట్రో ఎక్కాల్సి వస్తుందని కొందరు తెలుపుతున్నారు. మరోవైపు ట్రైన్ స్టేషన్‌కు వచ్చినప్పుడు.. అది ఆగే సమయం తక్కువగా ఉండటంతో ఆలస్యం చేయకుండా ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి గబగబ ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి క్యూలైన్ పాటించడం కష్టమని నెటిజన్లు తెలుపుతున్నారు.

Next Story

Most Viewed