‘ అవును కేసీఆర్ అంటే నాకు ప్రేమే’..: మంత్రి పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anjali |
‘ అవును కేసీఆర్ అంటే నాకు ప్రేమే’..: మంత్రి పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తెలంగాణ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవును కేసీఆర్ అంటే నాకు ప్రేమే అని చెప్పుకొచ్చారు. ఆయన తెలంగాణ ప్రజల కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నానని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇక పొంగులేటి నిన్న సచివాలయంలో మీడియాలో చిట్ చాట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండ్రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ పై మార్గదర్శకాలు విడుదల చేస్తామని, రూ. 2 లక్షల లోపు ఉన్న పంట రుణాల్నింటినీ పంద్రాగస్టు లోపు మాఫీ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని రైతులకు ధీమా వ్యక్తం చేశారు. అలాగే మంత్రి పొంగులేటి ఇప్పటివరకు ఒక్కసారి కూడా రైతు బంధు తీసుకోలేదని పేర్కొన్నారు. ఆయనకు వచ్చిన చెక్ లు తిరిగా ప్రభుత్వానికే ఇచ్చేసినట్లు తెలిపారు. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 లోగా రైతులందరికీ 2 లక్షల రూపాయలు పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. వచ్చే వారం నుంచి రుణమాఫీని అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం గైడ్ లైన్స్ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారని అన్నారు.

Next Story

Most Viewed