- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. బైరి నరేష్ దిష్టిబొమ్మ దహనం

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప మాలధారణ భక్తులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లపై భైరి నరేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హిందువుల్లో ఆగ్రహవేశాలు రగులుతున్న విషయం తెలిసిందే. నరేష్ వ్యాఖ్యలపై శుక్రవారం నుంచి అయ్యప్ప భక్తులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. శనివారం నిరసనలు ఉధృతమయ్యాయి. వరంగల్ చౌరస్తాలో శనివారం ఉదయం అయ్యప్పస్వాముల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ధర్నా నిర్వహించారు. వీరికి బీజేపీ నాయకులు మద్దతు పలికారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట, గవిచర్ల, వర్ధన్నపేట, ఇల్లంద, కట్ర్యాల, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో అయ్యప్ప నిరసనలు కొనసాగుతున్నాయి.
అయ్యప్ప దీక్ష పరుల ఆందోళనలు, నిరసనలకు బీజేపీ నాయకులు మద్ధతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలధారణ భక్తులు, బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. హిందూ వ్యతిరేకైనా బైరి నరేష్ రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామి మీద, దేవి దేవతల మీద, హిందుత్వం మీద ఇష్టం వచ్చినట్లుగా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సెక్యూలర్ వాదం ముసుగులో హిందుమతంపై దుష్ప్రాచారం చేసినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇకనైనా హిందువుల జోలికి రాకుండా ఉంటే మంచిదని హెచ్చరించారు. బైరి నరేష్‌పై పీడీ యాక్ట్ పెట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
వర్ధన్నపేటలో నరేష్ దిష్టిబొమ్మ దహనం..
వర్ధన్నపేట మండలం ఇల్లంద, కట్రీయల గ్రామాల్లో హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శనివారం వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేశారు. అనంతరం దిష్టి బొమ్మ దహనం చేశారు. నిందితులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read..
అతడిని 24 గంటల్లో అరెస్ట్ చేయాలి.. లేదంటే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తాం: అయ్యప్ప సేవా సమితి