కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు అస్వస్థత..

by Disha Web Desk 11 |
కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు అస్వస్థత..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ లో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 16 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. విద్యార్థినిలు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు రోజులుగా పాఠశాలలో పెడుతున్న ఆహారం సరిగా ఉండటం లేదని, ఆదివారం బయటి నుంచి ఆహారం తెప్పించారని, సోమవారం ఉదయం వండిన కూరలు మంగళవారం పెట్టారని ఇదేంటని మేడంని అడిగితే నిన్నటివి కాదని బెదిరించడంతో అవి తిన్న వారికి విరేచనాలు అయ్యాయని వాపోయారు.

సోమవారం ఉదయం చేసిన శనగలు, స్నాక్స్ మంగళవారం పెట్టారని అవి తిన్నావారు అస్వస్థతకి గురయ్యారని మా పరిస్థితి గురించి ఎస్ఓకి చెప్పిన బయట పని ఉందని పట్టించుకోకుండా వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదని అన్నారు. ఇక ఈ విషయాలు ఏవి ఎవరికి చెప్పకండి మా ఉద్యోగాలు పోతాయని మిగతా మేడంలు ప్రాధేయపడ్డారని తెలిపారు. మా ప్రాణాల గురించి ఎవరికి పట్టింపు లేదని ఎన్ని సార్లు ఆహారం బాగా లేకున్నా సర్డుకుపోయమని కానీ, మా ఆరోగ్యం మీదకు వచ్చాక కూడా అలానే సర్దుకుపొమ్మని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అస్వస్థతకు గురైన పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మిగతా వారి గురించి వాకబు చేసి వారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించి సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న కస్తూర్బా విద్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే మారు మూల ప్రాంతాల్లో ఉన్న విద్యాలయాల పరిస్థితి ఇక ఎలా ఉంటుందని సంబంధిత అధికారుల తీరు పట్ల జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed