కల్తీ ఆహారాన్ని గుర్తించారా? వీరికి కంప్లైంట్ చేయండి

by Rajesh |
కల్తీ ఆహారాన్ని గుర్తించారా? వీరికి కంప్లైంట్ చేయండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెరుగుతున్న ధరలు, డిమాండ్ దృష్ట్యా అన్ని చోట్ల కల్తీ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. కొందరు ఈ కల్తీని గుర్తిస్తుండగా.. మరికొందరు ఇదే మంచి ఆహారం అని లాగిచ్చేస్తున్నారు. తీరా అధికారులు గుర్తించే సరికి ముక్కున వేలేసుకొని ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇలాంటివి ముందుగానే గుర్తిస్తే.. ఏ అధికారికి తెలియజేయాలో ఇప్పటి వరకు చాలా మందికి అవగాహనే లేదు. ప్రభుత్వమే దీనిపై అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ జిల్లాల వారిగా ఉన్న అధికారులు, వారిని ఎలా సంప్రదించాలో తెలియజేయాల్సి ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారిగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో డివిజన్ల వారిగా ఉన్న అధికారులు, వారి సెల్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలను తెలియజేస్తూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆహార కల్తీని చాలా చోట్ల గుర్తించినప్పటికీ ఎవరికీ చెప్పాలో తెలియక స్పందిచలేకపోయామని చెబుతున్నారు. అయితే, జిల్లా అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోతే, ఉన్నతాధికారులకు 91001 05795 వాట్సాప్ ద్వారా తెలియజేవచ్చు.

Next Story