తెలుగుకు తెగులు పట్టిస్తే.. ఆ అవసరం మీకే రావచ్చేమో ఐకియా!.. ఐపీఎస్ ఆఫీసర్ కౌంటర్

by Ramesh Goud |
తెలుగుకు తెగులు పట్టిస్తే.. ఆ అవసరం మీకే రావచ్చేమో ఐకియా!.. ఐపీఎస్ ఆఫీసర్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తప్పుగా ఉన్న ఓ తెలుగు బోర్డుపై ఓ ఐపీఎస్ ఆఫీసర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమర్జెన్సీ ఎక్జిట్ అనే బోర్డు ప్రతీ మాల్ లోను ఉండటం మనం చూస్తునే ఉంటాం. అయితే కొన్ని కంపెనీలు ఎమర్జెన్సీ ఎక్జిట్ అని ఇంగ్లీష్ లో ఉన్న దానికి ట్రూ ట్రాన్స్‌లేటర్ ఉపయోగించి తెలుగులో తప్పుగా ఉన్న సరే దానినే పెట్టేస్తుంటారు. అలాంటి ఓ బోర్డునే రమేష్ మస్తీపురం అనే ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ బోర్డులో అత్యవసర ద్వారం అని ఉండాల్సిన చోట "అత్యవసర బయటకి దారి మాత్రమే", "తలుపు తెరిస్తే అలారం మోగుతుంది" అని రాసి ఉంది. దీనిని పోస్ట్ చేస్తూ.. తెలివి లేని వారు టెక్నాలజీ వాడితే తిక్క నాలెడ్జికి లెక్క ఉండదు. అంటూ.. మా దేశంలో వ్యాపారం చేస్తూ.. మా మాతృభాషలనే కించపరిస్తే.. అత్యవసర ద్వార అవసరం, మీకే రావచ్చేమో అని హెచ్చరించారు. అలాగే తప్పు సరిదిద్దుకోవాలని మనవి అంటూ ఐకియాఇండియా ను ట్యాగ్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఐకియా ఒక్కటే కాదు. ప్రతి మాల్ లో ఇలాగే తెలుగుకు తెగులు పట్టిస్తున్నారని, తెలుగు రాష్ట్రంలో.. అంత పెద్ద ఐకియాలో తెలుగు తెలిసిన ఉద్యోగులే లేరా.. అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story