కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

by Disha Web Desk 1 |
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, తిరుమల : కేంద్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగించడం పట్ల ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ఆ రోజు అన్నదమ్ముల్లా తెలంగాణ, ఏపీ మధ్య రాష్ట్ర విభజన అనివార్యమైందని అన్నారు. ఆనాడు ఏపీకి అవసరమైన హమీలను కాంగ్రెస్ అదిష్టానం ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అందుకు సంబంధించి అప్పుడున్న నాయకులంతా ప్రతిపాదనకు ఒప్పుకున్నారని తెలిపారు.

తాము ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నామని, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి అన్ని అంశాలైన, అది అభివృద్ధి కావచ్చు, హక్కులు కావచ్చు ఏదైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అందులో కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అదేవిధంగా తెలంగాణలోని దేవాలయాలకు టీటీడీ నుంచి నిధులు ఇవ్వాలని కోరుతూ.. సంస్థ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిపత్రం అందజేశారు. దేవాలయాల నిర్మాణాలకు తాము కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున కాంట్రిబ్యూషన్, భూమిని కూడా ఇస్తామని మంత్రి తెలిపారు. హుస్నాబాద్‌లో కూడా వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని, దేవాలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.

Next Story

Most Viewed