లాయర్స్పై దాడులు అరికట్టేందుకు అడ్వొకేట్ ప్రొటక్షన్‌ యాక్ట్‌ తేవాలి.. ఐఎఎల్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌

by Dishafeatures2 |
లాయర్స్పై దాడులు అరికట్టేందుకు అడ్వొకేట్ ప్రొటక్షన్‌ యాక్ట్‌ తేవాలి.. ఐఎఎల్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌
X

దిశ , తెలంగాణ బ్యూరో : న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, హత్యలు అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్‌ ప్రొటక్షన్‌ యాక్ట్‌ ను తక్షణం తీసుకొని రావాలని ఇండియన్‌ అసిసోయేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ (ఐఎఎల్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఇండియన్‌ అసిసోయేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌, తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశంలో జరిగిన సమావేశంలో బొమ్మగాని ప్రభాకర్‌ మాట్లాడుతూ .. దేశంలో న్యాయవాదుల రక్షణ, సంక్షేమం, ఆరోగ్యం గురించి ప్రత్యేక చట్టాలను ఇప్పటికీ రూపొందించకబడకపోవడం సరికాదని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కొరకు రాబోయే పార్లమెంట్‌ సమావేశాలలో చట్టాలతోపాటు నిధులను కేటాయించాలని వారు డిమాండ్‌ చేశారు.

బార్‌ కౌన్సిల్‌ సభ్యులు దుస్సా జనార్థన్‌, రాష్ట్ర సంఘ నాయకులు ఎ.వి.కృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయస్థానాలలో లైబ్రరీలు మరియు కోర్టు భవనాలకు కావల్సిన నిధులు, సిబ్బందిని నియమించాలని వారు కోరారు. జూనియర్‌ న్యాయవాదులకు ఇచ్చే స్టయిఫండ్‌ను రూ.5 వేలకు పెంచాలని, పదేళ్ళలోపు అందరికి వర్తింప చేయాలని కోరారు . సీనియర్‌ న్యాయవాదులకు పెన్షన్‌ పథకం, బీమా వర్తింప చేయాలనీ కోరారు. బార్‌ కౌన్సిల్లకు నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన నిజనిర్ధారణ కమిటీలో మహిళా సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి డి.అనీరాజా, సుప్రీంకోర్టు న్యాయవాది దీక్షా దివేది మరియు ప్రొఫెసర్లపై రాజద్రోహం కేసు, ఇతర కేసులు బనాయించడం ప్రజాస్వామిక, మానవహక్కులను కాలరాయడమేనని, వారిపై పెట్టిన కేసులను మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా తగిన సూచనలు ఇవ్వాలని సమావేశం డిమాండ్‌ చేసింది.

ఉమ్మడి పౌర స్మృతి విషయంలో 21వ లా కమీషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చౌహాన్‌ నేతృత్వంలో చేసిన సిఫార్సులను పక్కకు నెట్టి తొందరపాటు చర్యలు చేపట్టితే దేశంలో విభిన్నవర్గాల మధ్యన వైషమ్యాలు పొడచూపుతాయని దీనిపై విస్తృతంగా చర్చ చేయాలని అభిప్రాయపడ్డారు .అన్ని వర్గాల ప్రజల జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలను, సంస్కృతి, సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకొని, వారి, దేశ ప్రయోజనాల లక్ష్యంగా ఉండాలి తప్పా ఓటు బ్యాంక్‌ రాజకీయాలతో ఆలోచన చేయవద్దని సమావేశం ప్రకటించింది.

Next Story

Most Viewed