20వ తేదీన టీఎస్​ పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం : బీసీ సంఘం నేతలు

by Disha Web |
20వ తేదీన టీఎస్​ పీఎస్సీ  కార్యాలయాన్ని ముట్టడిస్తాం : బీసీ సంఘం నేతలు
X

దిశ, ముషీరాబాద్ : టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగుల జీవితాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని, ఈ నెల 20వ తేదీన టీఎస్పీ ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ టి.రాజ్ కుమార్, తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు భూపేసాగర్ అన్నారు. శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుండి నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రశ్నాపత్రాలు లీకేజీ అవడం నిరుద్యోగులను విద్యార్థులను వారి తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయన్నారు.

ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు నిరాశే ఎదురైందన్నారు. డిగ్రీ, పిజి, బీటెక్, ఎంటెక్ లు చదవి ఉద్యోగాల కోసం సంవత్సరాల కొద్దీ ఇంటికి దూరంగా ఉంటూ వేల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లో లక్షల ఫీజులు కట్టి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ప్రశ్న పత్రాల లీకేజీ అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాండ్ల రమేష్ పాల్గొన్నారు.Next Story