దేశప్రధానిగా ఎవరు ఉండాలో ఆలోచించాలి

by Disha Web Desk 15 |
దేశప్రధానిగా ఎవరు ఉండాలో ఆలోచించాలి
X

దిశ, జూబ్లిహిల్స్ : దేశప్రధానిగా ఎవరు ఉండాలో ఆలోచించాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ , బోరబండ డివిజన్ లలో బుధవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలో మనందరం మన ఓటుతో నిర్ణయించుకుందాం అని , దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో, ఎవరు ప్రధానమంత్రి అయితే దేశం సుభిక్షంగా, భద్రంగా ఉంటుందో ఆలోచించాలని కోరారు. నరేంద్రమోదీ దేశానికి అనేక సేవలు చేశారని, కరోనా కష్టకాలంలో

ఉచిత వ్యాక్సిన్లు అందించి మన ప్రాణాలు కాపాడారని అన్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు పేదలకు ఉచితంగా 5 కేజీల రేషన్ బియ్యం అందిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో రూపాయి లేకుండా వైద్యం అందించాలని మోదీ నిర్ణయించుకున్నారు అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మతఘర్షణలు, బాంబు పేళుళ్లు జరిగేవని, మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో బాంబు పేళుళ్లు, మతకల్లోలాలు లేవన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చే నెల 13న ఓటు హక్కు వినియోగించుకొని కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మోదీని, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో తనని గెలిపించాలని ప్రజలను కోరారు.



Next Story

Most Viewed