ప్రధాని మోడీ తెలంగాణ వ్యతరేకి: Vinod Kumar

by srinivas |
ప్రధాని మోడీ తెలంగాణ వ్యతరేకి: Vinod Kumar
X

దిశ , తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అవహేళన చేస్తూ మరోసారి పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ మాట్లాడడం, తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న వ్యతిరేక భావనకు ఈ మాటలే నిదర్శనమని టిజెఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ అన్నారు . సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి నుంచి తెలంగాణ విభజన పట్ల ద్వేష భావంతో మోడీ ఉన్నారని తెలిపారు . మోడీ పదేళ్లు ప్రధానిగా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. పదేళ్ల కాలంలో విభజన చట్టం హామీలు అమలు చేయకపోగా, తెలంగాణ పట్ల తన వ్యతిరేక భావనను ప్రతిసారి బయట పెట్టడం తెలంగాణ విద్యార్థుల త్యాగాలను, తెలంగాణ ఆమరుల త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే తెలంగాణ విభజన చట్టం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రెండు సెంట్రల్ వర్సిటీలు, గిరిజన వర్సిటీలను వెనుక బడిన జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయలను ఏర్పాటు చేయాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. మోడీ తెలంగాణ వ్యతిరేక వైఖరిని మానుకోవాలని సూచించారు. దేశ వ్యాప్తంగా యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసిన మోడీ ... తెలంగాణ వాటాగా యువతకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తాడో సమాధానం చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story