మహ్మద్ ప్రవక్త కుటుంబీకుల సమాధిని పునర్నిర్మించేందుకు అనుమతించాలి: అల్ బకీ సంస్థ

by Disha Web Desk 11 |
మహ్మద్ ప్రవక్త కుటుంబీకుల సమాధిని పునర్నిర్మించేందుకు అనుమతించాలి: అల్ బకీ సంస్థ
X

దిశ, హిమాయత్ నగర్ : సౌదీ అరబ్ లో మదీనే మునవర్లో ధ్వంసం చేసిన మహ్మద్ ప్రవక్త కుటుంబీకుల సమాధిని పునర్నిర్మించేందుకు అనుమతించాలని అల్ బకీ సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకుని సౌదీ అరబ్ ప్రభుత్వంతో చర్చించి ధ్వంసమైన తౌఫిక్ మహ్మద్ కుమార్తె హజ్రత్ బీబీ ఫాతిమా తో పాటు కుటుంబ సభ్యుల సమాధులకు మరమ్మత్తులు చేయించేందుకు అనుమతించేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. ధ్వంసమైన సమాధులను పునర్నిర్మించేందుకు అనుమతించాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా ధర్నాలు చేపట్టి నిరసనలు వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా ఈ నెల 18న ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్లో అల్ బకీ సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్ బకీ సంస్థ డాక్టర్ షఫీక్ బదర్, మౌలానా ఫయాజ్, మౌలానా హైదర్ జహేదా, మౌలానా హన్నాస్ రజ్వీ, ఫిరాసత్ అలీ బాక్రీ, సయ్యద్ అలీ హుస్సేన్ జహేదీలు మాట్లాడుతూ సౌదీ అరబ్ ధ్వంసమైన జన్నతుల్ బకీ సమాధి (గ్రీవాయార్డు)కి మరమ్మత్తులు చేయించాలని డిమాండ్ చేస్తూ గత మూడేళ్లుగా అల్ బకీ సంస్థ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టి, నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

1926లో సౌదీ అరబ్ రాజులు హజ్రత్ బీజ్ ఫాతిమా సమాధిని ధ్వంసం చేశారని, అప్పటి నుంచి ధ్వంసం చేసిన సమాధికి మరమ్మత్తులు చేపట్టకుండా, తమను సమాధి వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రెస్ మీట్​ తో పాటు సోషల్ మీడియా ద్వారా అల్ బకీ సంస్థ ఆధ్వర్యంలో ఈ సౌదీ అరబ్ ని ధ్వంసమైన సమాధుల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో ఈ నెల 18న ధర్నాలు చేపట్టి, నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.


Next Story