ఉత్తరాఖండ్ కొండలలో తెలంగాణ సంస్కృతి ప్రతిధ్వనిస్తుంది : డాక్టర్ మామిడి హరికృష్ణ

by Shiva Kumar |
ఉత్తరాఖండ్ కొండలలో తెలంగాణ సంస్కృతి ప్రతిధ్వనిస్తుంది : డాక్టర్ మామిడి హరికృష్ణ
X

దిశ, రవీంద్రభారతి : ఉత్తరాఖండ్ కొండలలో తెలంగాణ సంస్కృతి ప్రతిధ్వనిస్తుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ మామిడి అన్నారు. ఐఏఎస్ ట్రైనీలు తెలంగాణ లెజెండ్స్ పాత్రలు పోషిస్తున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరి, డెహ్రాడూన్‌లో శిక్షణ పొందుతున్న తెలంగాణకు చెందిన ఐఏఎస్ ప్రొబేషనర్లకు మా భాషా సంస్కృతి శాఖ నుంచి శిక్షణనిచ్చామని ఆయన తెలిపారు.

భారత దినోత్సవ వేడుకల్లో వారి ప్రదర్శనను ప్రదర్శించడానికి డప్పులు, కోలాటం, లంబాడి మొదలైన తెలంగాణ జానపద, గిరిజన కళలలో మేము వారికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఐఏఎస్ 2022కి ఎంపికైన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 39 మంది అభ్యర్థులున్నారు. శిక్షణలో భాగంగా బతుకమ్మ, బోనాలు ప్రదర్శనలతో పాటు రాణి రుద్రమ దేవి, చిట్యాల ఐలమ్మ తదితరుల ప్రత్యక్ష చిత్రీకరణతో సాంస్కృతిక ఊరేగింపు ఆకట్టుకుందని తెలిపారు. వేషధారణలు, జానపద గిరిజన కథల శైలులు అందరినీ ఆకర్షించాయి.Next Story

Most Viewed