సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు

by Disha Web Desk 15 |
సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు
X

దిశ, మెట్టుగూడ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి నెలలో ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (94 ట్రిప్పులు) ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 1 నుంచి జనవరి 20 వరకు నడుస్తాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రసిద్ధ గమ్యస్థానాలను కవర్ చేస్తూ 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఇవి సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్ నుండి నర్సాపూర్, మచిలీపట్టణం, కాకినాడ వైపు నడుస్తాయి. ఈ రైళ్లలో రిజర్వ్​, అన్​రిజర్వ్​ సదుపాయం ఉంది. ప్రధానంగా రాత్రి సమయాలలో ఈ రైళ్లు నడుపుతారు. రిజర్వేషన్ కోరుకునే ప్రయాణికులు రైల్వే పీఆర్ఎస్ కౌంటర్లతో పాటు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. జనరల్ కోచ్ లో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు జనరల్ కౌంటర్లలో క్యూలో నిలబడకుండా మొబైల్లో యూటీఎస్ యాప్ ద్వారా టిక్కెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ జోన్లో సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని అధికమించడానికి అదనపు రైళ్లు నదువుతున్నామని తెలిపారు.

Next Story

Most Viewed