- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
నాంపల్లిలో పర్యటించిన సచిన్ పైలట్..

దిశ, కార్వాన్ : జాతీయ కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ సోమవారం ఉదయం నాంపల్లి లోనీ శ్రీరామ దేవాలయం, యూసుఫీయాన్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలను చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి నియోజకవర్గ ఇంచార్జి ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సచిన్ పైలెట్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని 6 హామీలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో భాజపా ప్రభుత్వం చేసింది ఏమీలేదని అన్నారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారు విజయభేరి సభతో ప్రజలకు పూర్తి అవగాహన వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 30 రోజులలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామనీ మహిళల కోసం కాంగ్రెస్ అనే నినాదంతో వెళ్తుందనీ, ప్రతిఒక్కరికి ఇల్లు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఏవిధంగా అయితే విజయం సాధించామో అదేవిధంగా చతిస్గడ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని భీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.