తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పాత్ర కీలకమైందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉద్యోగులు పడుతున్న కష్టానికి గుర్తింపుగా వేతనాలు మరింత పెంచుతామని ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిండం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు, క్రింది స్థాయి ఉద్యోగులపై పెట్టిన కేసులను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సుమారు 30 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు.

తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలీమొద్దిన్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి కొప్పునమోని శ్రీనివాస్, సహ అధ్యక్షుడు రామాంజనేయులు , కోశాధికారి పి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో రూపొందించిన 2023 డైరీ, క్యాలెండర్ ను సోమవారం డీఎంఈ ఆడిటోరియంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉద్యోగులకు అధికంగా పదోన్నతులు కల్పించడం, అధిక రిక్రూట్ మెంట్ చేసిన ఘనత, అత్యధిక జీతభత్యాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్ఓలు డాక్టర్ పుట్లా శ్రీనివాస్, డాక్టర్ సుధాకర్ లాల్, డాక్టర్ బీ వెంకటేశ్వర రావు, డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ వెంకటి, డాక్టర్ కృష్ణ, డాక్టర్ కొండల్ రావు, టీజీఓ రాష్ట్ర అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు గండూరి వెంకట్, కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్, టీఎన్జీవో డీఎం అండ్ హెచ్ ఓ యూనిట్ అధ్యక్షుడు మామిడి ప్రభాకర్, కార్యదర్శి హరి, రవీందర్, చక్రధర్, క్రాంతికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed