Hyd: ఆ పదం లేకుండా చేస్తున్నారు.. కోదండరాం కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Hyd: ఆ పదం లేకుండా చేస్తున్నారు.. కోదండరాం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జీవో నెం.317 బాధితులకు న్యాయం చేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. జీవో నెం.317 బాధితులందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని సూచించారు. స్థానికత ప్రకారం ఆయా జిల్లాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. జీవో నెం.317 విషయంలో స్థానికతను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సీనియారిటీని అడ్డుకుపెట్టుకుని వారిని ప్రభుత్వం వేధిస్తోందని కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా 8 జిల్లాలో ఇదే సమస్య ఉందన్నారు. స్థానికత కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, ఇప్పుడు ఆ పదమే లేకుండా చేస్తున్నారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో నెం. 317 విషయంలో జిల్లాల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్షం వహించొద్దని ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు.



Next Story

Most Viewed