ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేయాలి : జేఏసీ

by Disha Web Desk 15 |
ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేయాలి : జేఏసీ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రాష్ట్ర జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో నాంపల్లి లో పే స్కేల్ సాధన సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ఉపాధి హామీ పథకం జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా ఈ పథకం కింద పనిచేస్తున్న 3874 మంది ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

ఈ విషయమై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా సీఎం కేసీఆర్ కు పలుమార్లు విజ్ఞప్తి కూడా చేశామన్నారు. తమ సమస్యకు సీఎం కేసీఆర్ వెంటనే పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్సుడు ఏ.లింగయ్య , రాష్ట్ర ఏపీవో సంఘం అధ్యక్షుడు అంజి రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈ నాగయ్య, సాంకేతిక సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి , ఈసీల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సీఓల రాష్ట్ర అధ్యక్షుడు రఫీ సయ్యద్, ప్రధాన కార్యదర్శి విజయ్ లతోపాటు 32 జిల్లాల జాక్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు , కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed