అనుమతులు లేని 'ఔట్అఫ్ ద బాక్స్'.. గంజాయికి అలవాటు పడిన విద్యార్థులు

by Disha Web Desk 6 |
అనుమతులు లేని ఔట్అఫ్ ద బాక్స్.. గంజాయికి అలవాటు పడిన విద్యార్థులు
X

పెద్ద అంబర్‌పేట్: పసుమాములలో రిసార్ట్స్ నిర్వాహకులు వ్యవసాయ భూమిని అద్దెకు తీసుకుని అందంగా ముస్తాబు చేసి యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. విందులలో భాగంగా స్విమ్మింగ్ ఫూల్, ఇతర కార్యక్రమాలకు ప్రత్యేక గదులు మాదిరిగా కంటైనర్లను ఏర్పాటు చేసి ఒక్కో పార్టీకి కనీసం ముప్పై నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. రాత్రి సమయాల్లో నిర్వహించే పార్టీలకు అద్దెలు మరింత ఉంటాయి. ఇంత డిమాండ్‌తో నిర్వహిస్తున్న రిసార్ట్స్ నిర్వాహకులు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించడం కొసమెరుపు. కాగా నిర్వాహకులలో ఒకరైన వ్యక్తి తన కుటుంబసభ్యులు పోలీసు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో స్థానికంగా ఉన్న కొంత మందిని బెదిరిస్తూ తమ దందా కొనసాగిస్త్నుట్లు సమాచారం.

గంజాయి కలకలం..

పెద్ద అంబర్‌పేటలోని 4వ వార్డు పరిధిలోని బ్యాంక్ కాలనీలో స్థానికంగా ఉన్న కొంత మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంటర్ కూడా సరిగ్గా పూర్తి కాని, విద్యార్థులు కాలనీ శివారులలో ఉన్న వెంచర్లలో వ్యసనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. పోలీసులు రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహించి వ్యసనాలకు పాల్పడే విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read: పొలాల్లో రిసార్ట్స్.. వీకెండ్ పార్టీల నిర్వహణ !



Next Story

Most Viewed