నా జీవితం నటనకే అంకితం : సినీ నటుడు సుమన్​

by Disha Web Desk 15 |
నా జీవితం నటనకే అంకితం : సినీ నటుడు సుమన్​
X

దిశ, అంబర్ పేట్ : చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సినిమా రంగంలో హీరోగా రాణించానని, తన జీవితం సినిమా రంగానికే అంకితమని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వివిధ రంగాలలో సేవలందించిన మహిళలకు శ్రీ ధాత్రి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ సౌజన్యంతో రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సుమన్ తన 45 సంవత్సర కాలంలో దాదాపు 700 సినిమాలలో పది భాషలలో నటించే అవకాశం కలిగిందన్నారు. సకల సమస్యల పరిష్కారానికి భగవద్గీత దోహదపడుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారుడు డాక్టర్ కేవీ రమణా చారి మాట్లాడుతూ.. సినిమాలో హీరోగా నటించడం కష్టం కాదని, నిజ జీవితంలో హీరోగా ఉండడం చాలా కష్టమన్నారు. జీవితంలో బతుకున్నంత కాలం ఒకరికి మంచి చేయాలనే ఆలోచన ఉండాలన్నారు. అనేక సినిమాలలో హీరోగా నటించిన సుమన్​ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. అనంతరం వివిధ రంగాలలో సేవలందించిన మహిళలకు శ్రీధాత్రి పురస్కారాలతో పాటు ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ కు ఆత్మీయ సత్కారం చేశారు.

కార్యక్రమంలో ఫ్యూచర్ టీచర్స్ అకాడమీ డైరెక్టర్ రేణుక ప్రసాద్, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అనంత లక్ష్మి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు పాలపర్తి సంధ్యారాణి , రఘు శ్రీ,, వ్యాఖ్యాత బుర్ర మోహన కృష్ణ పాల్గొన్నారు. సభకు ముందు గాయని గాయకులు అనూష లక్ష్మీ భారతి , వెంకీ, వినయ్ ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.


Next Story

Most Viewed