గీత కార్మికుల ప్రమాదాలను నివారించాలి

by Disha Web Desk 16 |
గీత కార్మికుల ప్రమాదాలను నివారించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గీత కార్మికులు తమ వృత్తిని కొనసాగిస్తూ..తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి మృతి చెందుతున్నారని, కొందరు శాశ్వత అంగ వైకల్యానికి గురవుతున్నారని ఆ ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు గురై మృత్యువాత పడకుండా తక్షణమే నివారించేందుకు 'సులభతరమైన సేఫ్టీ యంత్రాలను' పైలట్ ప్రాజెక్టు కింద అందించేందుకు నివేదికను అందజేయాలన్నారు.

హైదరాబాద్ మంత్రి కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ బద్ధంగా.. అనాదిగా తెలంగాణలో గీత వృత్తిని కొనసాగిస్తున్నారన్నారు. ప్రపంచంలో అనేక వృత్తుల్లో ఆధునికత సంతరించుకున్నప్పటికీ గీత వృత్తి మాత్రం అదే సాంప్రదాయ పద్ధతిలో కొనసాగడం వల్ల ప్రమాదవశాత్తు మరణాలు సంభవిస్తున్నాయని అవేదన చెందారు. కులవృత్తులకు పూర్వ వైభవాన్ని సీఎం కేసీఆర్ తీసుకొస్తున్నారన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ చంద్రయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed