LB Nagar: బెల్టు షాపులపై దాడులు.. భారీగా మద్యం పట్టివేత

by srinivas |
LB Nagar: బెల్టు షాపులపై దాడులు.. భారీగా మద్యం పట్టివేత
X

దిశ, ఎల్బీనగర్​: వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా ముగియటంలో పోలీసుల కృషి అభినందనీయమని ఎల్బీనగర్ ​డీసీపీ సాయి శ్రీ అన్నారు. జోన్​ పరిధిలో దాదాపు నలభై గంటలపాటు జరిగిన శోభా యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. ఒకవైపు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయటంతోపాటు ఊరేగింపు రోజున మద్యం అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో జోన్​పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బెల్టు షాపులపై ప్రత్యేక బృందాలు దాడులు జరిపి పెద్ద మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలియచేశారు. మొత్తం 37 కేసులు నమోదు చేసి 959 లీటర్లకు పైగా మద్యాన్ని సీజ్​ చేసినట్టు చెప్పారు. దీని విలువ 5 లక్షల 37వేల నూటా యాభై అయిదు రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.

ఎల్బీనగర్ ​స్టేషన్​ పరిధిలో 9 కేసులు నమోదు చేసి లక్షా 11వేల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సరూర్​నగర్​స్టేషన్​పరిధిలో 2 కేసులు నమోదు చేసి 29 వేలు, చైతన్యపురి స్టేషన్​లో 2 కేసులు రిజిష్టర్​చేసి 50వేల నాలుగు వందల పది, నాగోల్​స్టేషన్​లో 5 కేసులు నమోదు చేసి 92వేలు, వనస్థలిపురం స్టేషన్​లో 4 కేసులు పెట్టి 75వేల 320, హయత్​నగర్​స్టేషన్​లో 7 కేసులు నమోదు చేసి 75వేల 675, మీర్​పేట స్టేషన్​లో 5 కేసులు నమోదు చేసి 81వేల 2వందలు, అబ్డుల్లాపూర్​మెట్​స్టేషన్​లో 3 కేసులు నమోదు చేసి 22వేల 5వందల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఈ క్రమంలో బెల్టు షాపులు నడుపుతున్న పలువురిని అరెస్టు చేసినట్టు తెలిపారు.

Advertisement

Next Story