RTC క్రాస్ రోడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు

by Satheesh |
RTC క్రాస్ రోడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ దత్తసాయి కాంప్లెక్స్‌లో బుధవారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది. ఫైరింజన్ల సహయంతో పెద్ద ఎత్తున ఎగసిపడుతోన్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Next Story

Most Viewed