- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
బస్టాండ్ కు వెళ్లడానికి ఆటో ఎక్కిన వృద్ధురాలు ఏమైనట్టు

దిశ, మలక్ పేట్ : బంధువుల ఇంటికని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన వృద్ధురాలు కనిపించకుండా పోయిన సంఘటన మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మాదన్నపేట్ వినయ్ నగర్ ప్రాంతానికి చెందిన బుచ్చమ్మ (78) ఈ నెల 2 తేదీన మోయిన్ పేట్ లో నివాసం ఉండే బంధువుల ఇంటికి వెళ్లడానికి కూతురు రాజమణి ధోబి ఘాట్ వద్ద ఇమ్లిబన్ బస్టాండ్ కు వెళ్లడానికి ఆటో ఎక్కించింది. సాయంత్రం ఐదున్నర గంటలకు మెయిన్ పేట్ లో నివాసం ఉండే సోదరుడు శివకుమార్ కు ఫోన్ చేసి ఆరా తీయగా రాలేదని తెలిపాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఇమ్లిబన్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు 040-27854784 నెంబర్లలో సమాచారం అందించాలని కోరారు.