పాతబస్తీలో దారుణం..

by Dishanational1 |
పాతబస్తీలో దారుణం..
X

దిశ, చార్మినార్:​ 45 సంవత్సరాల మహిళ తలపై గుర్తుతెలియని వ్యక్తులు సిలిండర్​తో మోది హత్యచేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున రెయిన్ బజార్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రెయిన్​ బజార్​ఇన్​స్పెక్టర్ రంజిత్​కుమార్​గౌడ్​తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వెస్ట్ చంద్ర నగర్ లో గొడవ జరుగుతుందని ఫోన్​రావడంతో రెయిన్​బజార్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ అదే ప్రాంతానికి చెందిన పర్వీన్ సుల్తానా(45) మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడం కనిపించింది. పక్కనే మద్యం సీసాలు కూడా కనిపించడంతో గుర్తుతెలియని వ్యక్తులు మద్యం సేవించాక తలెత్తిన ఘర్షణలో గ్యాస్​ సిలిండర్​తో సదరు మహిళ తలపై మోదడంతో మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును రెయిన్​బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Next Story

Most Viewed