జలగం రామారావు కన్నుమూత

by Disha Web Desk 15 |
జలగం రామారావు కన్నుమూత
X

దిశ, ఖైరతాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు కుమారుడు కెప్టెన్ జలగం రామారావు (94) మంగళవారం కన్ను మూశారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని వ్యాలీ వ్యూ లో నివాసం ఉంటున్నారు. 22 సంవత్సరాల పాటు ఇండియన్ నేవీలో సేవలందించారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్, కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఎనర్జీ కన్జర్వేషన్ చైర్మన్ గా ఆయన పని చేశారు. ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామారావు మంగళవారం తుది శ్వాస విడిచారు. బుధవారం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.


Next Story