హైదరాబాద్‌లో దంచికొడుతోన్న వర్షం.. ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

by Satheesh |   ( Updated:2023-04-25 14:56:21.0  )
హైదరాబాద్‌లో దంచికొడుతోన్న వర్షం.. ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదరు గాలులతో కూడిన వర్షం దంచికొడుతోంది. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలో మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కూకట్ పల్లి, మూసాపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, చందానగర్, మియపూర్, బాలానగర్, సూరారం, శేరిలింగపల్లి, పటాన్ చెరు, అమీన్ పూర్, అల్వాల్, మల్కాజిగిరి, పంజాగుట్ట, ఈసీఐఎల్, కాప్రా, ఖైరతాబాద్, ఏఎస్ రావు నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. సరిగ్గా ఆఫీస్‌లు ముగిసే సమయంలోనే వర్షం పడటంతో ఇండ్లకు వెళ్లే ఉద్యోగస్తులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. కాగా, అవసరం ఉంటేనే ఇండ్ల నుండి బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు నగరవాసులకు సూచిస్తున్నారు.

Advertisement

Next Story