చార్మినార్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

by Mahesh |
చార్మినార్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
X

దిశ, చార్మినార్ : 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చారిత్రాత్మక చార్మినార్ వద్ద తెలంగాణ యోగా అధ్యయన పరిషత్ ఆధ్వర్యంలో యోగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ కమిషనర్ ప్రశాంతి, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీ కార్ అలీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ నుంచి గుల్జార్ హౌస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు యోగాసనాలు ప్రదర్శించారు. అనంతరం యోగ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్, యూనాని, తిబ్బి, హోమియోపతి కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed