మంటపుట్టిస్తున్న ఉల్లి ధరలు.. రెస్టారెంట్లలో షాకింగ్ బోర్డులు (ఫొటోలు) త

by sudharani |
మంటపుట్టిస్తున్న ఉల్లి ధరలు.. రెస్టారెంట్లలో షాకింగ్ బోర్డులు (ఫొటోలు)  త
X

దిశ, ఫీచర్స్: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు. అంతే కాకుండా ఉల్లిపాయ లేకుండా ఏ వంటకం కూడా పూర్తి కాదు. చాలా మంది ఇష్టం ఉల్లిపాయ తింటారు. బిర్యానిలోకి, చపాతిలోకి ఇలా అన్నింటిలోకి స్టఫ్ కింద ఉల్లిపాయ తింటారు. కానీ.. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. చాలా మంది డీలర్లు ఉల్లిని అక్రమంగా నిల్వ చేయడంతో ధరలు పెరుగుతున్నాయనే చర్చ కూడా జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. సాధారణంగా ప్రతి ఒక్కరు బిర్యానీలోకి చాలా ఇష్టంగా ఉల్లిపాయలు తింటారు. ఇచ్చినవి అయిపోతే అడిగిమరి ఎక్స్‌ట్రా ఏపించుకుని కూడా తినేవాళ్లు ఉన్నారు. ఉల్లిపాయలు, నిమ్మకాయలు ఇవ్వలేదని రెస్టారెంట్లో కొన్ని సార్లు గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఉల్లి ధరలు కొండెక్కడంతో.. హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్‌లలో విచిత్ర బోర్డులు దర్శనమిస్తున్నాయి. ‘ఉల్లిపాయలు లేవు.. ప్లీజ్ మాకు సహకరించండి’ అంటూ నోట్స్ అంటించారు.Next Story

Most Viewed