- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
కానరాని పండగ సందడి.. భారీగా మిగిలిపోయిన వినాయక విగ్రహాలు

దిశ, శేరిలింగంపల్లి : వినాయక చవితి వచ్చిందంటే చాలు వారం, పది రోజుల ముందు నుండే వినాయక ప్రతిమలను కొనుగోలు చేసేందుకు జనాలు పోటీపడే వారు. నచ్చిన ప్రతిమలను బుక్ చేసుకుని రెండు, మూడు రోజుల ముందు నుండే వాటిని మంఠపాలకు తరలించే వారు. గత రెండు సంవత్సరాలలో కరోనా ఎఫెక్ట్ వల్ల పెద్దగా హడావుడి లేదు. ఈసారి భారీ ఎత్తున విగ్రహాలు అమ్ముడు అవుతాయని తయారీదారులు సైతం భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈసారి కూడా పెద్దగా హడావుడి లేకుండా పోయింది.
అనుకున్న స్థాయిలో విగ్రహాలు అమ్ముడు పోక తయారీదారులు ఉసూరుమంటున్నారు. కొనుగోళ్లు లేక మియాపూర్ మెట్రో వద్ద రోడ్లపై పెద్ద మొత్తంలో విగ్రహాలు మిగిలిపోయాయి. ప్రతిష్టకు సమయం అయిపోతున్నా.. గిరాకీలు లేక అమ్మకందారులు నిరాశలో మునిగిపోయారు. ఇంత పెద్ద మొత్తంలో విగ్రహాలు మిగిలిపోవడం ఇదే తొలిసారని అమ్మకందారులు చెబుతున్నారు. ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయని, కానీ అమ్మకాలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.