- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత: ఎమ్మెల్యే గాంధీ

దిశ, మియాపూర్: శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ అన్నారు. మంగళవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పేట్ లోని గ్రీన్ వ్యాలీ కాలనీ , హఫీజ్ పేట్ డివిజన్ మైత్రినగర్ లో రూ. 1 కోటి 30 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , జగదీశ్వర్ గౌడ్ , జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ .. భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డీజీఎం నాగప్రియ, మేనేజర్ సాయి చరిత తదితరులు పాల్గొన్నారు.