అమాయక ప్రజలను మోసం చేస్తున్న నకిలీ ఆయుర్వేద ముఠా గుట్టు రట్టు...

by Disha Web Desk 11 |
అమాయక ప్రజలను మోసం చేస్తున్న నకిలీ ఆయుర్వేద ముఠా గుట్టు రట్టు...
X

దిశ, ఖైరతాబాద్ : రోగుల ఆరోగ్య బలహీనతలను ఆసరాగా చేసుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న నకిలీ ఆయుర్వేద గ్యాంగ్ బృంద సభ్యుల ముఠా గుట్టును మధురా నగర్ , ఎస్ఆర్ నగర్ పోలీసులు రట్టు చేశారు. ఎస్సార్ నగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వెంకట రమణ ,పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ , ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ,మధురా నగర్ ఇన్స్పెక్టర్ మధు సుధన్ రెడ్డి ల తో కలిసి వివరాలను వెల్లడించారు.

పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారిని గుర్తించి వారు పడుతున్న సమస్యల మాదిరిగానే తమకు తెలిసిన వారు కూడా ఇదే తరహా సమస్యతో బాధపడ్డారని మాయ మాట నమ్మిస్తారు.అనంతరం వారికి తెలిసిన ఆయుర్వేద ఔషధాలు దుకాణం ను సంప్రదించాని సూచిస్తారు. సదరు షాప్ నిర్వాహకులు వారు సూచించిన ప్రత్యేక లేహ్యాలు,భస్మాలను కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తారు.

దీని వల్ల రోగులు ఆర్థికంగా , శారీరకంగా , మానసికంగా నష్ట పోతున్నరని, తాము మోసపోయాము అన్న సంగతిని గ్రహించే లోగానే జరగాల్సిన నష్టం జరుగుతుందని పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ ఫేక్ ముఠా సభ్యులు బృందాలుగా ఏర్పడి రోగుల నుంచి లక్షల్లో మోసం చేస్తున్నారని ,ఇప్పటి వరకు ఈ గ్యాంగ్ సభ్యుల పై నగర వ్యాప్తంగా 14 కేసులకు పైగా నమోదు అయ్యాయని వారు తెలిపారు. ఇలాంటి ముఠా సభ్యుల పై ప్రజలు మోసపోవద్దని ,ఇప్పటి వరకూ ఇలాంటి గ్యాంగ్ సభ్యుల అరాచకాలకు బలైన వారు తమను సంప్రదించాలి అని ఏసీపీ మోహన్ కుమార్, వెంకట రమణ లు సూచించారు.


Next Story

Most Viewed