ప్రజలను కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు

by Disha Web Desk 15 |
ప్రజలను కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు
X

దిశ,బేగంపేట : ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్, రాంగోపాల్ పేట, డివిజన్ లలో కురుమ బస్తి, రంగ్రేజీ బజార్ బోయిగూడ, సనత్ నగర్ డివిజన్ లో సుభాష్ నగర్, సాయిబాబా నగర్, జై ప్రకాష్ నగర్, కైలాష్ నగర్ లలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా తప్పుడు హామీలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నాయకులు మోసపూరిత, అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నందున ఖచ్చితంగా మూడోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. మంత్రి వెంట కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, రాంగోపాల్పేట, సనత్ నగర్ డివిజన్ ల బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , కొలను బాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శేఖర్, మాజీ అధ్యక్షుడు ఖలీల్, నాయకులు బాల రాజ్, సరాఫ్ సంతోష్, నోమాన్, సురేష్ గౌడ్, కర్నాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజేష్, పుష్పాలత ,మల్లికార్జున్ గౌడ్, మహేందర్, స్కైలాబ్, ధర్మేంద్ర యాదవ్, చందు, తదితరులు ఉన్నారు.

ముస్లింలకు ప్రభుత్వం పెద్దపీట

ముస్లిం మైనార్టీ ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి పెద్దపీట వేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట మసీదు ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. మసీదులో ముస్లింలు ప్రార్థనలు ముగించుకొని బయటకు వచ్చిన అనంతరం మంత్రి వారిని కలిసి ఓట్లు అభ్యర్ధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు మంత్రిని సన్మానించి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, యాసిన్, రషీద్, షకీల్, ఇమ్రాన్, లతీఫ్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed