లాలాగూడ పీఎస్ పరిధిలో బాలుడు మిస్సింగ్

by Aamani |
లాలాగూడ పీఎస్ పరిధిలో బాలుడు మిస్సింగ్
X

దిశ,సికింద్రాబాద్: కుటుంబ సభ్యులు మందలించడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ అమర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం నార్త్ లాలాగూడ లోని లిల్లీ మోడల్ స్కూల్ సమీప ప్రాంతానికి చెందిన షేక్ మహమ్మద్ (14) అనే బాలుడి తల్లి పదేళ్ల క్రితం చనిపోవడంతో స్థానికంగా ఉండే వారి బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. అయితే, ఇటీవల షేక్ మహ్మద్ ను శేషా పహాడ్ లోని మదర్సా లో చేర్పించారు. కాగా, అతనికి మదర్పాకు వెళ్లడం ఇష్టం లేదని, ఏదైనా పనికి వెళ్తానని కుటుంబసభ్యులతో చెప్పడంతో వారు నిరాకరించారు.

పనికి వెళ్లే వయస్సు కాదని చెప్పి బాలుడిని గట్టిగా మందలించారు. దీంతో ఈ నెల 13న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వారికి తెలిసిన వారిని, బంధువులను వాకబు చేశారు. అయినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో శనివారం లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Next Story

Most Viewed