నకిలీ పేటీయం యాప్‌తో మోసం చేస్తున్న కేటుగాడు..

by Aamani |
నకిలీ పేటీయం యాప్‌తో మోసం చేస్తున్న కేటుగాడు..
X

దిశ, జూబ్లిహిల్స్: నకిలీ పేటీయం యాప్ తో వినియోగదారులను మోసం చేస్తున్న మోసగాడు అరెస్ట్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లిహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం... సంతోష్ నగర్ , సైదాబాద్ ప్రాంతానికి చెందిన నర్రా సందీప్ కుమార్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో గల ఎస్బీఐ ఏటీఎం , క్యాష్ డిపాజిట్ మిషన్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వారి వద్దకు వెళ్లి తనకు డబ్బులు (నగదు) అవసరం ఉన్నాయి అని చెప్పి , ఒక నకిలీ పేటీయం యాప్ ద్వారా వారికి డబ్బులు పంపినట్లు ఒక మెసేజ్ చూపించాడు. అనంతరం వారి వద్ద డబ్బులు తీసుకుని పారిపోవడం చేస్తున్నాడు. రాజు అనే వ్యక్తి వద్దరూ. 35000, శ్రీను అనే వ్యక్తి వద్ద రూ.12000 తీసుకుని సందీప్ కుమార్ పారిపోగా భాదితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, గురువారం నిందితుడు సందీప్ నీ అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.Next Story

Most Viewed