కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లు

by Anjali |
కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆశావర్కర్లకు 18వేలు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ మేరకు 18వేల వేతనాలు పెంచాలని కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ముట్టడికి యత్నించారు. అలాగే ఆశావర్కర్ల నూతన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.1వ తారీకు రోజే ఆశా వర్కర్ల జీతాలు చెల్లించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు నష్టం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అంతేకాకుండా వారిని టార్గెట్ చేస్తూ పని ఒత్తిడి తీసుకువస్తున్నారని, మానసిక వేదనకు గురి చేస్తున్నారని, దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పని భారం తగ్గించే విధంగా జాబ్ చార్జ్ ఉత్తర్వులను ఇవ్వాలని ఆశావర్కర్లు మండిపడ్డారు.



Next Story

Most Viewed