హైదరాబాద్ రాంకోఠిలో త్రవ్వకాలలో బయటపడ్డ శ్రీకృష్ణుని విగ్రహం

by Disha Web Desk 11 |
హైదరాబాద్ రాంకోఠిలో త్రవ్వకాలలో బయటపడ్డ శ్రీకృష్ణుని విగ్రహం
X

దిశ, కార్వాన్ : హైదరాబాద్ రాం కోఠిలోని గణేష్ ఆలయం పక్కన ఉన్న నవ జీవన్ ఉమెన్స్ కాలేజీలో తవ్వకాల్లో శ్రీకృష్ణుని విగ్రహం బయటపడింది. దీంతో భారీగా భక్తులు చేరుకుని పూజలు చేశారు. సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస చారి తెలిపిన వివరాల ప్రకారం.. రాం కోఠిలోని నవ జీవన మహిళ కాలేజీలో శుక్రవారం ఉదయం త్రవ్వకాలలో శ్రీ కృష్ణుని విగ్రహం బయట పడిందని తెలిపారు. కాగా కొన్ని సంవత్సరాల క్రితమే కాలేజీ మూత పడిందని ,బిల్డింగ్ కి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుందని, దానిని తప్పుదోవ పట్టించేందుకు ఎవరో కావాలనే మూసి ఉన్న కాలేజీ మైన్ గేటు తాళాలు పగులగొట్టి విగ్రహం పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని సీసీటీవీ కెమెరాల ద్వారా దుండగుడి ఆచూకీ కోసం పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

Next Story

Most Viewed