ఇది హైదరాబాదా ? అమెరికానా ?.. అశ్చర్య పోతున్న అమెరికన్స్

by Disha Web Desk 20 |
ఇది హైదరాబాదా ? అమెరికానా ?.. అశ్చర్య పోతున్న అమెరికన్స్
X

దిశ, చార్మినార్​ : జూబ్లీహిల్స్​, మాస్టర్​ మైండ్​, గచ్చిబౌళి ప్రాంతంలోకి వెళితే అమెరికా వెళ్లినట్టు కనిపిస్తుందని, అమెరికా నుంచి వచ్చినోళ్లే పరేషాన్​ అవుతున్నారని నేను హైదరాబాద్​లో ఉన్నానా? అమెరికాలో ఉన్నానా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. 2014 తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే ముఖ్యమంత్రి కేసీఆర్​ హయాంలో అన్నీ అద్భుతాలే జరగుతున్నాయని మంత్రి తలసాని కితాబిచ్చారు. ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో 4కోట్ల 96లక్షల జీహెచ్​ఎంసీ నిధుల ద్వారా జీప్లస్​ 3 మల్టీపర్పస్​ ఫంక్షన్​ హాల్​ పనులకు ఎమ్మెల్సీ ప్రభాకర్​, ఆలయ కమిటీ చైర్మన్​ జనగామ మధుసూధన్​ గౌడ్​ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం హిందూ, ముస్లింలందరూ కలిసి కట్టుగా పోరాడారని, నేడు స్వార్థ రాజకీయాల కోసం హిందూ ముస్లిం మధ్య గొడవలు పెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 24గంటలు కరెంట్​ వస్తుందంటే ఢిల్లీ నుంచి ఎవరు వచ్చి చేయలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మన తెలంగాణ ప్రభుత్వమే మన కోసం సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని అంటుండే.. ఇపుడు నేను పోతా బిడ్డో సర్కారు దవాఖానకు అని పోతున్నారన్నారు.

పాతబస్తీ ప్రజల సౌకర్యార్థమే తెలంగాణ ప్రభుత్వం ఉప్పుగూడ మహంకాళి దేవాలయ స్థలంలో రూ. 5కోట్ల రూపాయలతో జీప్లస్​ 3 మల్టీపర్పస్​ ఫంక్షన్​ హాల్​ నిర్మిస్తుందన్నారు. చంపాపేట్​, శంషాబాద్​, గుడిమల్కాపూర్​లలో ​శుభకార్యాలు చేయడానికి ఆసక్తి చూపారని, ప్రతి ఒక్కరూ ఈ మల్టీపర్పస్​ ఫంక్షన్​ హాల్​లోనే శుభకార్యాలు చేస్తానన్న డిమాండ్​ విపరీతంగా పెరుగుతుందన్నారు. మే 25వ తేదీన జరుగనున్న బోనాల సమావేశంలో ఉమ్మడిదేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో మీ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.

5వేల మంది పోలీసులను ఎక్కడి నుంచి తీసుకువస్తావ్ ​?

బోనాలు, వినాయక చవితి పండుగలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తు వస్తున్నామని, దమ్మిడి ఇవ్వనోడు.. దేనికి పనికిరానోడు.. పండుగల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం వదిలిపెడితే మేము పండుగలు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతున్నాడని, మేము వదిలిపెడితే బందోబస్తుకు 5వేల మంది పోలీసులను ఎక్కడి నుంచి తీసుకువస్తావని బండి సంజయ్​ను ఉద్దేశించి ప్రశ్నించారు. పండుగలకు ఎన్ని శాఖలు పనిచేస్తాయో తెలుసా ? ఇన్ని శాఖలను హెలిక్యాప్టర్​లో ఢిల్లీ నుంచి తీసుకువస్తాడా ? మాట్లాడనీకే నోరు ఉన్నది కదా అని ఏది మాట్లాడితే అది సరిపోదని హెచ్చరించారు.

బోనాలు తర్వాతే లాల్​దర్వాజా ఆలయ విస్తరణ పనులు...

చారిత్రాత్మక లాల్​దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ విస్తరణ పనులకు రూ. 10 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. ఆలయ సమీపంలోని ఇండ్లను కొనుక్కొని కడుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని, ఈ బోనాల ఉత్సవాలు ముగిశాక ఆలయ విస్తరణ పనులు ప్రారంభిస్తామని మంత్రి తలసాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజ్, మాజీ చైర్మన్​ రాకేష్​ తివారి, మధుసూధన్​ యాదవ్​, సౌత్​జోన్​ జీహెచ్​ఎంసీ జోనల్​ కమిషనర్​ అశోక్​ సామ్రాట్​, కార్పొరేటర్లు ఫహద్​, సలీంబేగ్​, సమద్​బిన్​ అబ్దాద్​, బీఆర్​ఎస్​ నేతలు జమ్మిచెట్టు రాజు, తిరుపతి నర్సింగ్​రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story