పెద్దలు నాలుగు రాళ్లు వెనుకేసుకొమ్మంటే.. ఈయన ఏకంగా కిడ్నీలో 206 వేసేశాడు

by Dishanational2 |
పెద్దలు నాలుగు రాళ్లు వెనుకేసుకొమ్మంటే.. ఈయన ఏకంగా కిడ్నీలో 206 వేసేశాడు
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది కిడ్ని స్టోన్స్‌తో బాధపడుతుంటారు. అయితే ఇలా కిడ్నిస్టోన్స్‌తో బాధ పడుతున్న వ్యక్తి ఆసుపత్రికి వెళ్లగా తనకు సర్జరీ చేసి డాక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హైదరాబాద్‌లోని అవేర్‌ గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రిలో ఓ రోగి నుంచి వైద్యులు 206 కిడ్నీలో రాళ్లను తొలగించారు. ఈ రాళ్ల వల్ల 56 ఏళ్ల రోగి ఆరు నెలల పాటు ఎడమ నడుము భాగంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు, వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇది తీవ్రమైంది. దీంతో సర్జరీ చేయగా,206 స్టోన్స్ బయటపడ్డాయి.

వివరాల్లోకి వెళ్లితే.. నల్లగొండ జిల్లాకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య తనకు విపరీతమైన నడుం నొప్పి లేవడంతో ఏప్రిల్ 22న అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌లోని వైద్యులను సంప్రదించారు. వారు చికిత్స చేసి కొన్ని మందులు ఇవ్వడంతో అవి వాడగా అతనికి స్వల్పకాలిక ఉపశమనం మాత్రమే కలిగింది. కానీ రోజు రోజుకు నొప్పి పెరగడంతో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో అతను మళ్లీ ఆసుపత్రికి వచ్చి సర్జరీ చేయించుకున్నాడు.

అవేర్ గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ పూల నవీన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రాథమిక చికిత్స, తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్‌లో ఎడమ మూత్రపిండ కాలిక్యులి (ఎడమవైపు కిడ్నీ స్టోన్స్) ఉన్నట్లు వెల్లడైందని, CT KUB స్కాన్‌తో అదే నిర్ధారించబడిందని తెలిపారు. దీంతో రోగికి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక గంట పాటు కీహోల్ సర్జరీకి చేసి మొత్తం కాలిక్యులిని తొలిగిచామని, ఆ సర్జరీ తర్వాత 206 స్టోన్స్ బయటపడ్డాయని పేర్కొన్నారు. అనంతరం రోగి త్వరగా కోలుకున్నాడని, అతన్ని రెండో రోజు డిశ్చార్జ్ చేసిన్లు తెలిపారు. ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో డాక్టర్. నవీన్ కుమార్‌కు, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ వేణు మన్నె సహాయపడ్డారని, వారికి థాంక్స్ చెప్పారు.

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో, చాలా మంది ప్రజలు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అందువలన ప్రజలు ఎక్కువ నీరు తీసుకోవాలని, వీలైతే కొబ్బరి నీళ్ళు తీసుకోవలన్నారు. ఇవి హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రజలు వేడి ఎండలో ప్రయాణించడాన్ని నివారించడం లేదా తగ్గించడం, అలాగే డీహైడ్రేషన్‌కు కారణమయ్యే సోడా ఆధారిత పానీయాలను తీసుకోకపోవడం కూడా చాలా ముఖ్యమని సూచించారు.


Next Story

Most Viewed