ఎందుకు లేట్ అవుతుంది.. నిమజ్జనాలపై పోలీస్ కమిషనర్ ఆరా?

by Disha Web Desk 2 |
ఎందుకు లేట్ అవుతుంది.. నిమజ్జనాలపై పోలీస్ కమిషనర్ ఆరా?
X

దిశ, సిటీ బ్యూరో: గణేష్ నిమజ్జనం రెండో రోజైన శుక్రవారం కూడా నెమ్మదిగా జరగడంపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆరా తీసినట్లు సమాచారం. ఎన్టీఆర్ మార్గం నుంచి టెలిఫోన్ భవన్ వరకు, ట్యాంక్‌బండ్ నుంచి బషీర్‌బాగ్ వరకు వరుసగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూ కట్టడంతో హిమాయత్ నగర్, లిబర్టీ, పాత కంట్రోల్ రూమ్, లక్డీకాపూల్, ఏసీ గార్డ్స్, ఖైరతాబాద్ జంక్షన్, అయోధ్య జంక్షన్, రాణిగంజ్, లోయర్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

అయోధ్య జంక్షన్ నుంచి మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఎన్టీఆర్ మార్గం నుంచి టెలిఫోన్ భవన్ వరకు క్యూ కట్టిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసిన అనంతరం ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా మళ్ళిస్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పై క్యూ కట్టిన గణేష్ మండపాలు నిమజ్జనం జరిగిన తర్వాత వాహనాలను రాణీగంజ్ సికింద్రాబాద్ మీదుగా మళ్ళిస్తున్నారు. క్యూ కట్టిన గణేష్ మండపాలను బట్టి నిమజ్జనం ప్రక్రియ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.



Next Story

Most Viewed