UPSC సివిల్స్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన హైదరాబాద్ యువతి

by Disha Web Desk 2 |
UPSC సివిల్స్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన హైదరాబాద్ యువతి
X

దిశ, వెబ్‌డెస్క్: UPSC నిర్వహించిన సివిల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి, యువకులు సత్తా చాటారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు పొందింది. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన గాడిపర్తి గిరిధర్ - మణిదీపిక కూతురు గాడిపర్తి సాహి దర్శిని 112వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,016 మందిని ఎంపిక చేయగా.. ఆదిత్య శ్రీవాస్తవ మొదటి ర్యాంకు, అనిమేశ్ ప్రధాన్ రెండవ ర్యాంకు సాధించారు. దాదాపు 30 మంది తెలుగు విద్యార్థులు అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. కాగా, కేంద్ర ప్రభుత్వంలోని 1105 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది మే 28న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. వివిధ దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఇవాళ తుది ఫలితాలు విడుదల చేశారు.


Next Story