HYD METRO: హైదరాబాద్ మెట్రోపై ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్.. పూర్తిగా తగ్గిన మహిళల రద్దీ

by Disha Web Desk 1 |
HYD METRO: హైదరాబాద్ మెట్రోపై ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్.. పూర్తిగా తగ్గిన మహిళల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం హైదరాబాద్ మెట్రో రైళ్ల తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంతకు ముందు మెట్రో రైళ్లలో ఎక్కడ చూసిన మహిళా ప్రయాణికులే కనిపించేవారు. కానీ, ప్రస్తుతం సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంతో మెట్రో ప్రయాణించే మహిళల సంఖ్య సుమారు 5 నుంచి 10 శాతం వరకు తగ్గింది. దీంతో నిరుపేద, మధ్యతరగతి మహిళలు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు అందరూ సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో గతేడాది 5.5 లక్షలు దాటిన మెట్రో మహిళా ప్రయాణికులు ప్రస్తుతం 4.8 లక్షలు నుంచి 4.9 లక్షలు మధ్య నమోదు అయినట్లు ఎల్‌అండ్‌టీ అధికారులు వెల్లడించారు.


Next Story

Most Viewed