HYD : న్యూఇయర్ వేళ పబ్ నిర్వాహకులకు High Court షాక్

by Disha Web |
HYD : న్యూఇయర్ వేళ పబ్ నిర్వాహకులకు High Court షాక్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని పలు పబ్ నిర్వాహకులకు హై కోర్టు షాక్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై పబ్ నిర్వాహకులు వెకెట్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యూఇయర్ వేడుకల్లోను ఆంక్షలు పాటించాల్సిందేనని హెచ్చరించింది. టాట్, జూబ్లీ 800, ఫర్జి కేఫ్, అమ్నిషియా, హైలైఫ్, డైలీడోస్ లతో పాటు మరో నాలుగు పబ్‌లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సౌండ్ పెట్టొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. గతంలో పబ్ లలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సౌండ్ సిస్టం పెట్టడం, న్యూసెన్స్ చేయడం పట్ల పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: న్యూ ఇయర్‌‌లో మరింత హీటెక్కనున్న తెలంగాణ రాజకీయం!




Next Story

Most Viewed