కల్యాణ లక్ష్మికి ఎంత బడ్జెట్ కేటాయించారు.. పెండింగ్ నిధులెన్ని : అధికారులతో సమీక్షలో మంత్రి పొన్నం

by Disha Web Desk 1 |
కల్యాణ లక్ష్మికి ఎంత బడ్జెట్ కేటాయించారు.. పెండింగ్ నిధులెన్ని : అధికారులతో సమీక్షలో మంత్రి పొన్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కల్యాణ లక్ష్మి పథకానికి ప్రతి ఏడాది ఎంత బడ్జెట్ పెట్టాలి.. గతంలో ఎంత పొందుపరిచారు? ఎన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయి? వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఆయన సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల సంక్షేమం కొరకు గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన అంశాలు, కేటాయించిన నిధులు, ఖర్చులపై సమగ్రంగా రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు బీసీ గురుకుల పాఠశాలలు ఎన్ని? అక్కడ చదువుతున్న విద్యార్థులు ఎంత మంది? స్కాలర్ షిప్‌ల కోసం కేటాయించిన నిధులు ఎన్ని? వంటి అంశాలపై కూడా నివేదిక కోరారు.

బీసీ వెల్ఫేర్‌పై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై కూడా నిధుల వివరాలు తెలియజేయాలని కోరారు. ఇక బీసీ కార్పొరేషన్‌లో పెండింగ్ నిధులపై కూడా మంత్రి ఆరా తీశారు. దీంతో పాటు దోభి ఘాట్ల నిర్మాణం, విద్యుత్ సబ్సిడీ, నాయి బ్రాహ్మణులకు విద్యుత్ సబ్సిడీ‌కి అవుతున్న ఖర్చు ఎంత? ఎన్ని బీసీ హాస్టళ్లకు సొంత భవనాలున్నాయి? ప్రతి నెలా ఎన్ని బిల్డింగ్‌లకు అద్దెలు కడుతున్నారు? వంటి వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని మంత్రి సూచించారు. మరోవైపు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో అమలవుతున్న బీసీ సంక్షేమ పాలసీల‌పై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు..

కేంద్రం నిధులో తీసుకురావడంలో ఫెయిల్..

వివిధ కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు సమకూర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం తీసుకురావడంలో ఫెయిల్ అయిందని పొన్నం ఫైర్ అయ్యారు. వ్యక్తిగత విమర్శలకు వెళ్లి ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసిందని అన్నారు. కానీ, తమ ప్రభుత్వం రాజకీయ వైరుధ్యాలు తప్పా, ప్రజా పరిపాలన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతామని అన్నారు. బడ్జెట్ కూర్పుపై ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వలనే బడ్జెట్‌లో సంక్షోభం ఏర్పడిందని పేర్కొననారు. అప్పుల తెలంగాణను గాడిని పెడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫెర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.



Next Story