- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మంత్రి గంగుల కమలాకర్ కు హైకోర్టు షాక్.. ఆ కేసులో కీలక ఉత్తర్వులు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు హైకోర్టు షాకిచ్చింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ దాఖలు చేసిన పిటీషన్ పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు దీనిపై రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తితో కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈనెల 12నుంచి 17వ తేదీ మధ్యలో క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి నివేదికను అందచేయాలని కమిషన్ ను ఆదేశించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గంగుల కమలాకర్ తన సమీప ప్రత్యర్థి బండి సంజయ్ పై 14,974 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
అయితే, దీనిపై ఆ మరుసటి సంవత్సరం బండి సంజయ్ హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగుల కమలాకర్ గెలిచినట్టుగా చేసిన ప్రకటన చెల్లదని పిటీషన్ లో పేర్కొన్నారు. గంగుల కమలాకర్ తన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు అందచేశారని తెలిపారు. తనను విజేతగా ప్రకటించాలంటూ కోరారు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. అనంతరం రిటైర్డ్ జిల్లా జడ్జి శైలజ నేతృత్వంలో కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈనెల 12నుంచి 17వ తేదీలోపు క్రాస్ ఎగ్జామినేషన్ ను పూర్తి చేసి సమగ్ర నివేదికను అందచేయాలని కమిషన్ కు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.